Andhra Pradesh: ఎంసీఏ కోర్సు కాల వ్యవధిని తగ్గించిన ఏపీ ప్రభుత్వం
- ప్రస్తుతం మూడేళ్లు ఉన్న ఎంసీఏ కోర్సు
- రెండేళ్లకు కుదిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
- వచ్చే ఏడాది నుంచి కొత్త కరిక్యులమ్ అమలు చేయాలని ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసీఏ కోర్సు కాల వ్యవధిని కుదించింది. ప్రస్తుతం ఎంసీఏ కోర్సు వ్యవధి మూడేళ్లు ఉంది. దీన్ని రెండేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సతీశ్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. గణితం చదివిన సైన్స్, కామర్స్, ఆర్ట్స్ పట్టభద్రులకు ఎంసీఏ కోర్సును రెండేళ్లకు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త కరిక్యులమ్ ను అమలు చేయాలంటూ అన్ని యూనివర్శిటీలను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఎంసీఏ విద్యార్థులకు మేలు జరగనుంది.