Jagan: బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధానికి సీఎం జగన్ కృతజ్ఞతలు

CM Jagan thanked PM Modi

  • ఇవాళ సీఎం జగన్ పుట్టినరోజు
  • 48వ జన్మదినం జరుపుకుంటున్న జగన్
  • దీర్ఘాయుష్షు కలగాలంటూ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
  • వినమ్రంగా బదులిచ్చిన సీఎం జగన్
  • రాష్ట్రవ్యాప్తంగా జగన్ పుట్టినరోజు వేడుకలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ 48వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ఉదయం నుంచి సీఎం జగన్ పై శుభాకాంక్షల జడివాన కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయాన్నే శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ కు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం లభించాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. తాజాగా ప్రధాని శుభాకాంక్షల ట్వీట్ పై సీఎం జగన్ స్పందించారు.

"గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారూ... సహృదయంతో మీరు తెలియజేసిన శుభాకాంక్షల పట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ వినమ్రంగా బదులిచ్చారు. కాగా, ట్విట్టర్ లో జగన్ బదులిచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఆ ట్వీట్ కు వేల సంఖ్యలో లైకులు, వందల్లో రీట్వీట్లు లభించాయి.

అటు, సీఎం సొంత జిల్లాలో భారీగా వేడుకలు నిర్వహించారు. భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకల్లో 48 కిలోల భారీ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాశ్ రెడ్డి పాల్గొన్నారు. అంతేగాకుండా, రాష్ట్రవ్యాప్తంగా జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు.

Jagan
Narendra Modi
Birthday
Wishes
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News