karunas: రజనీ, కమల్ కంటే మా చిన్న పార్టీ శక్తిమంతమైంది: నటుడు కరుణాస్

out patry better than rajni kamal sasy karunas

  • వాళ్ల పార్టీలతో మేము పొత్తు పెట్టుకోము
  • అన్నాడీఎంకే కూటమిలోనే మా పార్టీ కొనసాగుతుంది
  • రెండు సీట్లు కోరనున్నాం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెలల్లో జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. చిన్న పార్టీలు ఏయే పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలన్న విషయంపై ఆలోచిస్తున్నాయి. సినీ నటుడు రజనీకాంత్ పార్టీ పెడతానని ప్రకటించడం, ఇప్పటికే  కమల హాసన్ తమ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం ప్రారంభించడంతో ఆ పార్టీల్లో ఏదో ఒకదానితో ముక్కుళత్తోర్‌ పులి పడై (ఎంపీపీ) వ్యవస్థాపకుడు, సినీనటుడు, ఎమ్మెల్యే కరుణాస్ పొత్తు పెట్టుకుంటారని ప్రచారం జరుగుతోంది.

అయితే, రజనీకాంత్‌, కమలహాసన్ కంటే తమ పార్టీ అత్యంత శక్తిమంతమైనదని ఆయన ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలన్న విషయంపై నిన్న తమ పార్టీ నేతలతో కలిసి కరుణాస్ చర్చించి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే కూటమి తరఫున పోటీచేసేందుకు తాము రెండు సీట్లు కోరనున్నట్టు చెప్పారు.

karunas
Rajinikanth
Kamal Haasan
Tamilnadu
  • Loading...

More Telugu News