Jagan: సీఎం జగన్ కు టీటీడీ అర్చకుల వేదఆశీర్వచనం.. శ్రీవారి తీర్థప్రసాదాలు అందించిన టీటీడీ చైర్మన్

TTD Chairman and priests met CM Jagan and blessed
  • నేడు సీఎం జగన్ జన్మదినం
  • శుభాకాంక్షల వెల్లువ
  • సీఎంను కలిసిన వైవీ సుబ్బారెడ్డి, తిరుమల అర్చకులు
  • డైనమిక్ యంగ్ లీడర్ కు హ్యాపీ బర్త్ డే అన్న మెగాస్టార్ 
ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్న పోస్టులతో సోషల్ మీడియా నిండిపోయింది. తాజాగా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుమల ఆలయ అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలను సీఎం జగన్ కు అందించారు. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సీఎంకు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆయనకు పవిత్ర వస్త్రాన్ని బహూకరించారు.

 మీ సంకల్పం, మీ పట్టుదల నిజంగా ప్రశంసనీయం : చిరంజీవి

సీఎం జగన్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలిపారు. డైనమిక్  యంగ్ లీడర్ కు హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేశారు. "మీ సంకల్పం, లక్ష్యాలను చేరుకోవాలనుకునే మీ పట్టుదల నిజంగా ప్రశంసనీయం. మీకు రాబోయే ఏడాది అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, మరెన్నో సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించాలని ఆశిస్తున్నాను" అంటూ స్పందించారు.
Jagan
Birthday
YV Subba Reddy
Priests
TTD

More Telugu News