Budda Venkanna: జగన్, విజయసాయిరెడ్డి లిక్కర్ మాఫియా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది: బుద్ధా

Budda Venkanna slams Jagan and Vijayasai
  • వైసీపీ అగ్రనేతలపై మరోసారి ధ్వజమెత్తిన బుద్ధా
  • జలగల్లా లూటీ చేస్తున్నారని ఆరోపణలు
  • మహిళల పుస్తెల్లాగేస్తున్నారని వ్యాఖ్యలు
  • ప్రజలు రోడ్డుమీద కొట్టే రోజు వస్తుందని వ్యాఖ్యలు
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి వైసీపీ అధినాయకత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రెసిడెంట్ మెడల్ జగన్ రెడ్డి, ఆంధ్రా గోల్డ్ సాయి రెడ్డి లిక్కర్ మాఫియా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని స్పందించారు. జలగల్లా రూ.25 వేల కోట్లు మద్యపాన నిషేధం పేరుతో లూటీ చేస్తున్నారని ఆరోపించారు. "మహిళల పుస్తెలు సైతం లాగేస్తున్న మాఫియా వెనుక ఉన్న నీవంటి నిక్కర్ గ్యాంగ్ ని ప్రజలు రోడ్డుమీద కొట్టే రోజు మరెంతో దూరంలో లేదు సారాయి రెడ్డి గారు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Budda Venkanna
Jagan
Vijay Sai Reddy
YSRCP
Telugudesam

More Telugu News