Car: హైదరాబాదు నాంపల్లిలో కారు బీభత్సం... వీడియో ఇదిగో!

  • అదుపుతప్పి దూసుకొచ్చిన కారు
  • కారులో బేగంపేట వెళుతున్న అనికేత్ అనే యువకుడు
  • నీలోఫర్ హోటల్ వద్ద అదుపుతప్పిన వైనం
  • ఓ సెక్యూరిటీ గార్డుకు గాయాలు
  • వాహనాలు ధ్వంసం
Speeding car rams into parking area in Nampally

హైదరాబాదులో నిత్యం రద్దీగా ఉండే నాంపల్లి ప్రాంతంలో ఓ కారు అదుపు తప్పి వేగంగా దూసుకొచ్చింది. ఓల్డ్ సిటీలోని ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన అనికేత్ నాంపల్లి మీదుగా బేగంపేట వెళ్లే క్రమంలో రెడ్ హిల్స్ వద్దకు చేరుకున్నాడు. అయితే నీలోఫర్ హోటల్ వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పింది.

పార్కింగ్ ఏరియాలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డును ఢీకొనడమే కాకుండా, పలు వాహనాలను ఢీకొట్టింది. సుమారు 10 వాహనాలు ధ్వంసం అయ్యాయి. గాయపడిన సెక్యూరిటీ గార్డును ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నడిపిన అనికేత్ ను అదుపులోకి తీసుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News