YS Jagan: సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ

YSRCP conveys advance birthday wishes to CM Jagan

  • రేపు సీఎం జగన్ పుట్టినరోజు
  • సోషల్ మీడియాలో స్పందించిన వైసీపీ
  • లక్ష్యంతో మొదలైన ప్రస్థానం అంటూ ట్వీట్
  • విజయతీరాలకు చేరిన వైనం అంటూ వివరణ
  • ఆదర్శ పాలనకు సిసలైన నిర్వచనం అని వెల్లడి

రేపు సీఎం జగన్ జన్మదినం (డిసెంబరు 21). ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ ప్రియతమ నేతకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసింది. తండ్రి ఆశయాలను కొనసాగించాలనే లక్ష్యంతో మొదలైన ఓ ప్రస్థానం అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. అనేక సవాళ్లను, కుట్రల సుడిగుండాలను దాటుకుంటూ, ప్రజల ఆశీస్సులు, దేవుడి దీవెనలే కొండంతం అండగా విజయతీరాలకు చేరిన వైనం అంటూ సీఎం జగన్ రాజకీయ ప్రస్థానాన్ని అభివర్ణించింది. నేడు యావత్ భారతావని ఏపీ వైపు చూసేలా ఆదర్శవంతమైన పాలనకు సిసలైన నిర్వచనంలా నిలిచిన ప్రస్థానం అంటూ అభినందనలు తెలిపింది. ఈ సందర్భగా వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక సీడీపీని కూడా వైసీపీ ట్విట్టర్ లో పంచుకుంది.

YS Jagan
Birthday
Wishes
YSRCP
Andhra Pradesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News