Tirumala: 22న తిరుమలలో ఆలయ శుద్ధి, భక్తుల దర్శనాలకు ఆటంకాలు!

Koil Alwar Tirumanjanam in Tirumala On 22nd

  • 25న వైకుంఠ ఏకాదశి పర్వదినం
  • కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్న టీటీడీ
  • ఆ తరువాత వైకుంఠ ద్వారాల అలంకరణ

ఈ నెల 25న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా, 22న తిరుమల ఆలయంలో శుద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్నామని టీటీడీ ప్రకటించింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, మూలికలు, నీటితో ఆలయంలోని అన్ని ప్రాంతాలను శుభ్రం చేయనున్నామని, ఈ సందర్భంగా మంగళవారం నాడు దర్శనాలకు ఆటంకం ఏర్పడనుందని తెలిపారు. ఉదయం 12 గంటల నుంచి భక్తులకు దర్శనాలు ఉంటాయని స్పష్టం చేశారు. తిరుమంజనం తరువాత వైకుంఠ ద్వారాల అలంకరణ పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.

Tirumala
Tirupati
TTD
Temple
Koli Alwar Tirumanjanam
  • Loading...

More Telugu News