Farooq Abdullah: ఫరూక్ అబ్దుల్లాకు షాక్.. కోట్లాది రూపాయల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ!

ED attaches Farooq Abdullahs assets

  • జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకలపై కేసు
  • రూ. 11.86 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
  • ఈ ఆస్తుల మార్కెట్ వాల్యూ రూ.70 కోట్ల వరకు ఉంటుందన్న అధికారులు

నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. ఆయనకు చెందిన రూ. 11.86 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ మనీ లాండరింగ్ కేసులో ఈ మేరకు ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ ఈరోజు తెలిపింది. తన ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంపై ఫరూక్ అబ్దుల్లా అసహనం వ్యక్తం చేశారు. ఆస్తులను అటాచ్ చేయడాన్ని కోర్టులో సవాల్ చేస్తానని చెప్పారు.

జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన అవకతవకలకు సంబంధించి 2018లో ఫరూక్ అబ్దుల్లాపై సీబీఐ ఛార్జిషీట్ నమోదు చేసింది. 2002 నుంచి 2011 మధ్య  కాలంలో రూ. 43.69 కోట్ల మేర అవకతవకలు జరిగాయంటూ అబ్దుల్లాతో పాటు మరో ముగ్గురిపై ఛార్జిషీట్ వేసింది.

ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో ఫరూక్ కు చెందిన మూడు రెసిడెన్సియల్, ఒక కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. ఈ ఆస్తుల బుక్ వాల్యూ రూ. 11.86 కోట్లు మాత్రమే అయినప్పటికీ... మార్కెట్ వాల్యూ మాత్రం రూ. 60 నుంచి 70 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెపుతున్నారు.

Farooq Abdullah
NC
Enforcement Directorate
Assets Attach
  • Loading...

More Telugu News