Event Dancer: విజయవాడలో ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద మృతి

Event dancer dies in Vijayawada

  • స్థానిక వాంబే కాలనీలో మృతి కలకలం
  • తన నివాసంలో సీలింగుకి వేలాడుతూ విగతజీవురాలిగా గాయత్రి
  • తన భార్య మృతికి నీలిమ కారణమంటున్న భర్త
  • గాయత్రి మృతిపై సందేహాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

విజయవాడలో ఓ ఈవెంట్ డ్యాన్సర్ మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానిక వాంబే కాలనీలో నివసించే గాయత్రి ఓ ఈవెంట్ డ్యాన్సర్. అయితే తన నివాసంలో ఉరి వేసుకున్న స్థితిలో గాయత్రి విగతజీవురాలిగా కనిపించింది. దీనిపై గాయత్రి భర్త స్పందిస్తూ, తన భార్య మృతి చెందడానికి ముందు నీలిమ అనే యువతి తమ ఇంటికి వచ్చిందని తెలిపాడు. తాను ఆ సమయంలో పిల్లలతో కలిసి బయటికి వెళ్లానని వివరించాడు. నీలిమతో గొడవ వల్లే గాయత్రి చనిపోయిందని ఆరోపించాడు. కాగా, గాయత్రి మృతిపై కుటుంబ సభ్యులు సందేహాలు వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

Event Dancer
Gayatri
Death
Neelima
Vijayawada
Police
  • Error fetching data: Network response was not ok

More Telugu News