Wistron: ఉద్యోగులందరికీ క్షమాపణ చెపుతున్నాం: విస్ట్రన్ ఐ ఫోన్ కంపెనీ

Wistron company apologiges employees

  • జీతాలు చెల్లించలేదని ఉద్యోగుల విధ్యంసం
  • సంస్థకు కోట్లాది రూపాయల నష్టం
  • మరోసారి ఇలా జరగదని చెప్పిన కంపెనీ

బెంగళూరుకు సమీపంలోని కోలార్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న విస్ట్రన్ ఐ ఫోన్ కార్పొరేషన్ ప్లాంటులో ఆ సంస్థ ఉద్యోగులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. వాహనాలను సైతం అగ్నికి ఆహుతి చేశారు. జీతాలను చెల్లించలేదనే ఆగ్రహంతో వారు చేసిన విధ్వంసానికి సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో విస్ట్రన్ కార్పొరేషన్ ఈరోజు తమ ఉద్యోగులకు క్షమాపణ చెప్పింది. ప్లాంట్ లో జరిగిన ఘటన దురదృష్టకరమని తెలిపింది.

కొందరు వర్కర్లకు సకాలంలో లేదా సక్రమంగా జీతాలు చెల్లించలేదనే విషయాన్ని గుర్తించామని ఓ ప్రకటనలో తెలిపింది. ఐఫోన్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ను తొలగించామని వెల్లడించింది. ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు పెద్దపీట వేస్తామని చెప్పారు. తమ సంస్థ పాటిస్తున్న ప్రధాన విలువలు ఇవేనని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తమ ప్రాసెస్ లను విస్తరిస్తున్నామని, టీమ్స్ ను రీస్ట్రక్చర్ చేస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News