Somu Veerraju: చైనా, పాకిస్థాన్ లనే ఎదుర్కొంటున్నాం... ఈ వైసీపీ, టీడీపీ ఏపాటి?: సోము వీర్రాజు

Somu Veerraju says they can face YSRCP and TDP

  • స్థానికంగా భయపడే ప్రసక్తే లేదన్న సోము వీర్రాజు
  • జగన్, చంద్రబాబు తోడుదొంగలని వ్యాఖ్యలు
  • చంద్రబాబు అవినీతిపై జగన్ మాట్లాడడంలేదని వెల్లడి
  • బీజేపీ-జనసేన భాగస్వామ్యం బలోపేతమవుతుందని స్పష్టీకరణ
  • ఏపీలో ప్రత్యామ్నాయ శక్తి తామేనని ఉద్ఘాటన

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన వ్యాఖ్యల్లో పదును పెంచారు. చైనా, పాకిస్థాన్ లను సైతం ఎదుర్కొంటున్నామని, స్థానికంగా భయపడే ప్రసక్తేలేదని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ, టీడీపీలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. జగన్, చంద్రబాబు తోడుదొంగలు అని... రాష్ట్రంలో చంద్రబాబు బలహీనపడితే మరొకరు పైకొస్తారన్న ఉద్దేశంతోనే చంద్రబాబు అవినీతిపై జగన్ మాట్లాడడంలేదని ఆరోపించారు.

అమరావతిలో రాజధాని అంశంపై రిఫరెండంకు డిమాండ్ చేస్తున్న చంద్రబాబు అమరావతి నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ.7,200 కోట్లు ఏంచేశారో చెప్పాలని సోము వీర్రాజు నిలదీశారు. రాబోయే రోజుల్లో బీజేపీ-జనసేన భాగస్వామ్యం బలమైన శక్తిగా ఎదుగుతుందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి తామేనని అన్నారు.

Somu Veerraju
YSRCP
Telugudesam
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News