Naga Shourya: బధిర యువకుడిగా యంగ్ హీరో నాగశౌర్య?

Naga shourya plays deaf character in coming movie
  • ప్రస్తుతం సొంత బ్యానర్లో 'లక్ష్య' సినిమా 
  • త్వరలో బాలకృష్ణతో నాగశౌర్య మల్టీ స్టారర్ 
  • మూగ, బధిర యువకుడిగా ఛాలెంజింగ్ రోల్   
తన సినిమాలలో కొత్తదనం చూపించడం కోసం.. కొత్తరకం పాత్రలు పోషించడం కోసం ఉత్సాహం చూపే యంగ్ హీరో నాగశౌర్య.. ఇప్పుడు నటనాపరంగా ఓ ఛాలెంజింగ్ రోల్ చేయనున్నాడు. మూగ, బధిర యువకుడిగా నటించడానికి రెడీ అవుతున్నాడు. పైగా ఈ పాత్ర తాను పోషించేది ప్రముఖ హీరో బాలకృష్ణ నటించే సినిమాలో కావడం విశేషం.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాల కోసం కథలు వింటున్నారు. ఈ క్రమంలో నూతన దర్శకుడు శ్రీమాన్ వేముల చెప్పిన కథకు బాలకృష్ణ ఓకే చెప్పారట. ఇందులో రెండో హీరో పాత్రకు నాగశౌర్యను ఎంపిక చేశారు. ఈ పాత్రలో ఆయన మూగ, బధిర యువకుడిలాగా కనిపించనున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని గతంలో బాలకృష్ణతో పలు చిత్రాలు నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించనున్నారు.

ఇదిలావుంచితే, ప్రస్తుతం నాగశౌర్య సినిమాల పరంగా స్పీడు పెంచాడు. సొంత బ్యానర్ పై 'లక్ష్య' చిత్రాన్ని చేస్తుండగా, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించే మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు. అలాగే మరికొన్ని ప్రాజక్టులు కూడా దశలో వున్నాయి.
Naga Shourya
Balakrishna
Boyapati Sreenu

More Telugu News