Nurse: కరోనా వ్యాక్సిన్ వేయించుకుని కుప్పకూలిన అమెరికా నర్సు... వీడియో ఇదిగో!

Tennesse nurse fainted after taking corona vaccine

  • అమెరికాలో వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు
  • మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్
  • యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ పంపిణీ
  • వ్యాక్సిన్ వేయించుకుని మీడియాతో మాట్లాడిన నర్సు
  • మాట్లాడుతుండగానే నేలకొరిగిన వైనం

అనేక ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాలు అత్యవసర అనుమతులు మంజూరు చేసి ప్రజలకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. కాగా, అమెరికాలో మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి లభించింది. ఈ క్రమంలో టెన్నెస్సీలో ఓ హెడ్ నర్సు ఫైజర్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కొన్ని నిమిషాలకే కుప్పకూలడం ఆందోళన కలిగించింది.

హెడ్ నర్సు టిఫానీ డోవర్ కరోనా డోసు తీసుకున్న అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. వ్యాక్సిన్ వేయించుకోవడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నానని చెబుతున్నంతలో ఒరిగిపోయింది. సారీ, నాకేదో అవుతోంది అంటూనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన మీడియా కెమెరాల్లో రికార్డయింది. కాగా, స్పృహకోల్పోయిన ఆ హెడ్ నర్సు టిఫానీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందట. ఈ వీడియో నెట్టింట ఎక్కువగా కనిపిస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News