Hyderabad: హైదరాబాద్‌లో పైప్‌లైన్ పగిలి రహదారిపై ఎగిసిపడుతోన్న నీరు.. భారీగా ట్రాఫిక్ జామ్

  • మెహిదీపట్నం-అత్తాపూర్ రహదారిపై ట్రాఫిక్ జామ్
  • లంగర్‌హౌస్ రేతిబౌలిలో పగిలిన పైపులైన్
  • పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబరు 53 వద్ద ఘటన
pipeline bursts in hydearabad

హైదరాబాద్‌లోని మెహిదీపట్నం-అత్తాపూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లంగర్‌హౌస్ రేతిబౌలిలో పైపులైన్ పగలడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. అక్కడి పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబరు 53 వద్ద నీటిపైపు లైన్ పగిలింది. దీంతో నీరు భారీగా బయటకు వస్తుండడంతో ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఆ పిల్లర్ వద్ద కింది నుంచి బ్రిడ్జి ఎత్తు మేర నీరు ఎగిసిపడుతోంది. ప్రధానంగా ఆ పిల్లర్ వద్ద ఒక్క వాహనం కూడా ముందుకు వెళ్లట్లేదు.
    
ఎగిసిపడుతున్న నీటి వల్ల మెహిదీపట్నం-అత్తాపూర్ రహదారిపై నీరు నిలిచిపోయింది. ఆ రహదారిపై పెద్ద ఎత్తున వెళ్లే వాహనాల రాకపోకలన్నీ నత్తనడకన నడుస్తుండడంతో ట్రాఫిక్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  పైపులైను పగలడంపై స్పందించిన అధికారులు నీటి ప్రవాహాన్ని ఆపడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు.

More Telugu News