Telangana: ఆటోలో ప్రయాణికులను కుక్కిన డ్రైవర్... ఏందన్నా ఇది, ఆటోనా లేక మినీ బస్సా? అంటూ తెలంగాణ పోలీసు విభాగం విస్మయం

Telangana police responds to a auto overload incident

  • మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ వద్ద ఘటన
  • ఆటోలో పెద్ద సంఖ్యలో ప్రజలను ఎక్కించిన డ్రైవర్
  • ఆటోను ఆపిన బ్లూకోల్ట్ పోలీసులు
  • డ్రైవర్, ప్రయాణికులకు కౌన్సిలింగ్
  • ట్విట్టర్ లో స్పందించిన తెలంగాణ పోలీసు డిపార్ట్ మెంట్

పరిమిత సంఖ్యలోనే ఆటోల్లో ప్రయాణికులను ఎక్కించాలని నిబంధనలు ఉన్నా, కొందరు ఆటోడ్రైవర్లు ఆ నిబంధనలను ఉల్లంఘిస్తుంటారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆటోడ్రైవర్ తన ఆటోలో ఏకంగా డజను మందికి పైగా కుక్కాడు. అయితే ప్రమాదకర రీతిలో ఓవర్ లోడ్ అయిన ఆ ఆటోను బాలానగర్ బ్లూకోల్ట్ పోలీసులు నిలువరించారు.

ఆటో నుంచి అందరినీ కిందికి దింపి వారిలో సురక్షిత ప్రయాణానికి సంబంధించిన అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. ఆటోడ్రైవర్ తో పాటు ప్రయాణికులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా, దీనికి సంబంధించిన ఫొటోలను  ట్విట్టర్లో చూసిన తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏందన్నా... అది ఆటోనా లేక మినీ బస్సా! 7 సీటరా లేక 14 సీటరా? అంటూ విస్మయం చెందింది. "ఆటో నీది, ప్రాణం అమాయకులది! మరి ఆటోలో ప్రయాణించే సమయంలో వారి ప్రాణాలకు భరోసా ఎవరిది?" అంటూ ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News