Nagababu: దేవతలుంటారన్న నమ్మకం నీ వల్లే కలిగిందమ్మా!: కుమార్తె పుట్టినరోజు సందర్భంగా నాగబాబు భావోద్వేగ స్పందన

Nagababu emotional post on daughter Niharika birthday
  • పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిన నిహారిక
  • కుమార్తె పుట్టినరోజు సందర్భంగా నాగబాబు శుభాకాంక్షలు
  • సోషల్ మీడియాలో ప్రత్యేక సందేశం
  • నిహారిక చిన్నప్పటి ఫొటో పోస్టు చేసిన వైనం
ఇటీవలే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిన తన కుమార్తె నిహారిక పుట్టినరోజు సందర్భంగా సినీ నటుడు నాగబాబు భావోద్వేగభరితంగా స్పందించారు. తన జీవితంలోకి ఓ దేవతలా వచ్చిందని పేర్కొన్నారు. "డియర్ నిహా... దేవుడంటే నమ్మకంలేని ఓ వ్యక్తి గురించి చెప్పాలి.  నా జీవితంలోకి నీ రాక వల్లే దేవతలుంటారన్న నమ్మకం కలిగింది. నేను ఎల్లప్పుడూ పోరాడేది నీ కళ్లలో కోటికాంతుల సంతోషం కోసమే. నిన్ను మరింతగా నవ్వించడం కోసమే నేను వెనక్కి తగ్గుతాను. హ్యాపీ బర్త్ డే నానా... ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను" అంటూ తన సందేశం వెలువరించారు. తన పోస్టుతో పాటు నిహారిక చిన్నప్పటి ఫొటోను కూడా నాగబాబు పంచుకున్నారు.
Nagababu
Niharika
Birthday
Wishes

More Telugu News