TV Actress: పదేళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పేసిన నటి పూజాగౌర్

Pooja Gor confirms breakup with Raj Singh Arora

  • తమ మధ్య విభేదాలున్నట్టు గతేడాది ప్రకటించిన పూజ
  • విడిపోయినట్టు వస్తున్న వార్తలు నిజమేనని స్పష్టీకరణ
  • విడిపోయినా మంచి స్నేహితుల్లా ఉంటామన్న పూజ

బుల్లితెర నటుడు రాజ్‌సింగ్ అరోరాతో పదేళ్లపాటు కొనసాగిన ప్రేమకు నటి పూజాగౌర్ బ్రేకప్ చెప్పేశారు. తామిద్దరం విడిపోయినట్టు వస్తున్న వార్తలపై స్పందించిన నటి.. ఆ వార్తలు నిజమేనని స్పష్టం చేశారు. పరస్పర అంగీకారంతో ఇద్దరం విడిపోయినట్టు తెలిపారు. తమ మధ్య విభేదాలు ఉన్నట్టు పూజ గతేడాదే ప్రకటించింది. చిన్నచిన్న గొడవలు చోటుచేసుకుంటున్నట్టు చెప్పింది. దీంతో వారిద్దరూ విడిపోబోతున్నట్టు వార్తలు వచ్చాయి.

రాజ్‌తో తనకున్న రిలేషన్ గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటున్నారని పేర్కొన్న నటి.. తామిద్దరం విడిపోవాలని పరస్పరం నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇక నుంచి ఎవరి జీవితం వారిదే అయినప్పటికీ తమ మధ్య ఇంతకాలం ఉన్న ప్రేమాభిమానాలు, ఒకరంటే మరొకరికి గౌరవం జీవితాంతం ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇకపై తామిద్దరం మంచి స్నేహితులమని, ఈ విషయంలో ఎప్పటికీ మార్పు ఉండబోదని పూజాగౌర్ పేర్కొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News