BC Sankranthi: ఒక్క రూపాయి నిధులు కూడా లేని బీసీ కార్పొరేషన్లు ఎందుకు?: టీడీపీ నేత పంచుమర్తి అనురాధ

Why BC corporations without funds says TDP

  • బీసీ కార్పొరేషన్లతో బీసీలకు ఒరిగేది ఏమీ లేదు
  • బీసీలను మభ్యపెట్టేందుకే కార్పొరేషన్లు
  • నేతి బీరలో నెయ్యి చందంగా కార్పొరేషన్లు ఉన్నాయి

ఈరోజు వైసీపీ ప్రభుత్వం బీసీ సంక్రాంతిని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా 56 బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన ఛైర్మన్లు, డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, రాష్ట్రానికి బీసీలు వెన్నెముక అని అన్నారు. రాష్ట్రంలో సంక్రాంతి ముందుగానే వచ్చిందని చెప్పారు.

మరోవైపు బీసీ కార్పొరేషన్లతో బీసీలకు ఒరిగేది ఏమీ లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. బీసీలను ఉద్ధరించినట్టు జగన్ గొప్పలు చెప్పుకున్నారని... కేవలం బీసీలను మభ్యపెట్టడానికే పదవులు, హోదాలు అంటున్నారని చెప్పారు. బీసీల కోసం కేటాయించిన ప్రత్యేక బడ్జెట్, నిధులు ఏమయ్యాయని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.

టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ, నేతి బీరలో నెయ్యి చందంగా బీసీ కార్పొరేషన్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఒక్క రూపాయి నిధులు కూడా లేని కార్పొరేషన్ల వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. కార్పొరేషన్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది టీడీపీనే అని చెప్పారు. 30 మంది ప్రభుత్వ సలహాదారుల్లో బీసీలు ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News