PSLV C50: పీఎస్ఎల్వీ సీ-50 ప్రయోగం సక్సెస్... కక్ష్యలోకి ఉపగ్రహం
- శ్రీహరికోట నుంచి నింగికెగసిన పీఎస్ఎల్వీ సీ-50
- కక్ష్యలోకి సీఎంఎస్-01 ఉపగ్రహం
- కేవలం 22 నిమిషాల్లో ముగిసిన ప్రక్రియ
- కమ్యూనికేషన్ సేవలు అందించనున్న శాటిలైట్
- జీశాట్-12 స్థానాన్ని భర్తీ చేయనున్న సీఎంఎస్-01
శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ అనుకున్న పని పూర్తి చేసింది. భారత 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-01ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియ అంతా కేవలం 22 నిమిషాల్లో ముగిసిందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. కాగా, సీఎంఎస్-01 ఉపగ్రహం జీవితకాలం 7 సంవత్సరాలు. సీ బ్యాండ్ సేవలు అందించడానికి ఈ శాటిలైట్ ఉపయోగపడనుంది. పదకొండేళ్ల కిందట రోదసిలోకి పంపిన జీశాట్-12 కాలపరిమితి ముగియడంతో దాని స్థానాన్ని సీఎంఎస్-01తో భర్తీ చేస్తారు.