V Srinivas Goud: దేవుడి దయ ఉంటేనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Miniter Srinivas Goud sensational comments on double bedroom houses

  • ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రావు
  • కడుతున్న ఇళ్ల సంఖ్య తక్కువ
  • దేవుడిని ప్రార్థించండి.. ఏడాదిలోనే ఇల్లు రావచ్చు

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాజెక్టును టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రావని ఆయన స్పష్టం చేశారు. కడుతున్న ఇళ్లు తక్కువ అని... ఆ ఇళ్లను కూడా లాటరీ ద్వారా కేటాయిస్తామని చెప్పారు.

అందుకే దేవుడి దయ ఉంటేనే ఇల్లు వస్తుందని, దేశంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా లక్షలాది ఇళ్లను కట్టి ఇవ్వలేదని చెప్పారు. ప్రతి ఏటా కొన్ని ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు. దేవుడి దయ ఉంటే ఎప్పుడో ఒకసారి ఇల్లు వస్తుందని అన్నారు. దేవుడిని ప్రార్థిస్తూ ఉండాలని... అదృష్టం ఉంటే ఒక ఏడాదిలోనే ఇల్లు రావచ్చని చెప్పారు. పదేళ్లకో, 15 ఏళ్లకో అందరికీ ఇళ్లు వస్తాయని అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News