Raghu Rama Krishna Raju: కోలుకున్న రఘురామకృష్ణరాజు.. ముంబై నుంచి హైదరాబాద్‌కు వస్తున్నానని వీడియో

raghurama krisha raju to come hyd from mumbai

  • ఇటీవల ముంబైలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
  • భగవంతుడిని ప్రార్ధించిన వారందరికీ ధన్యవాదాలు  
  • 4 వారాల పాటు తాను ఎవరినీ కలవలేకపోవచ్చని వ్యాఖ్య

ఇటీవల ముంబైలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసుకున్నానని, ఈరోజు మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నానని ఎంపీ రఘురామకృష్ణరాజు తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ఈ సందర్భంగా వీడియో రూపంలో ఆయన మాట్లాడారు.

తాను త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్ధించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో తాను ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్నానని తెలిపారు.

ఆపరేషన్ చేయించుకున్న నేపథ్యంలో ఇన్ఫెక్షన్ కు గురి కాకుండా ఉండేందుకు బయట ఎక్కడా తిరగొద్దని వైద్యులు చెప్పారని ఆయన తెలిపారు. నాలుగు వారాల పాటు తాను ఎవరినీ కలవలేకపోవచ్చని, అయితే, ఫోనులో మాట్లాడవచ్చని తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News