Nitin Gadkari: 2025 నాటికి రూ. 100 లక్షల కోట్లతో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు: నితిన్ గడ్కరీ
- ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం
- ఎన్ఐపీ పేరిట మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు
- సీఐఐ బాగస్వామ్య సదస్సులో నితిన్ గడ్కరీ
దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు ఎన్ఐపీ (నేషనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పైప్ ప్లైన్) భారీ కసరత్తు చేయనుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో ఎన్ఐపీని ఆవిష్కరించిన తరువాత ఆయన మాట్లాడుతూ, 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి ఇండియాను 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కల నెరవేరుతుందని అన్నారు. ఎన్ఐపీ రూ. 111 లక్షల కోట్లను పెట్టుబడులుగా పెట్టాలని ప్రణాళికలు రూపొందించనున్నదని తెలిపారు.
సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్), డీపీఐఐటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) ఆధ్వర్యంలో 2020 భాగస్వామ్య సదస్సు జరగగా, ఓ ప్రత్యేక సెషన్ లో గడ్కరీ పాల్గొన్నారు. ఇండియాలో మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుక్షణం కృషి చేస్తోందని, ప్రజలందరి జీవితాల్లో క్వాలిటీని పెంచేందుకు ఎన్ఐపీ కృషి చేస్తుందని అన్నారు.
కేవలం రహదారుల విభాగంలోనే రూ. 25 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నామని, అమృతసర్ - అజ్మీర్, ఢిల్లీ - అమృతసర్ జాతీయ రహదారుల ప్రాజెక్టులకు రూ. 65 కోట్లు వెచ్చించనున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి ఎంఎస్ఎంఈ సెక్టారుపై ఎంతో ప్రభావాన్ని చూపించిందని వ్యాఖ్యానించిన గడ్కరీ, సరైన విధానాలను, క్రెడిట్ గ్యారంటీ, స్కీమ్ లు, క్రెడిట్ లింక్డ్ కాపిటల్ సబ్సిడీ స్కీములను పారదర్శకంగా అమలు చేయడం ద్వారా కష్టాల నుంచి సంస్థలను గట్టెక్కిస్తామన్నారు. జీడీపీలో 30 నుంచి 40 శాతం భాగస్వామ్యం ఎంఎస్ఎంఈలదేనని ఆయన గుర్తు చేశారు.