Trivikram Srinivas: భారీ పౌరాణిక చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు?

  • అల్లు అరవింద్ నిర్మిస్తున్న రామాయణం  
  • నితీశ్ తివారి, రవి ఉద్యావర్ దర్శకత్వం 
  • తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో నిర్మాణం 
  • సంభాషణలు రాసి ఇచ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ 
Trivikram Srinivas works for Ramayan

తనదైన బ్రాండ్ తో పంచ్ డైలాగులు.. మంచి డైలాగులు రాస్తూ మాటల మాంత్రికుడిగా పేరుతెచ్చుకున్న ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా ఓ పౌరాణిక చిత్రానికి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఓపక్క దర్శకుడిగా బిజీగా ఉన్నప్పటికీ తాజాగా రామాయణకథకు ఆయన మాటలు రాసినట్టు వార్తలొస్తున్నాయి.  

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాము రామాయణాన్ని తెరకెక్కిస్తున్నట్టు, భారత చలన చిత్రసీమ కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్ర నిర్మాణం జరుగుతుందని మూడేళ్ల క్రితం ప్రకటించారు. ఈ చిత్రనిర్మాణంలో నమిత్ మల్హోత్రా, మధు వంతెన కూడా భాగస్వాములు అవుతారని ఆయన తెలిపారు. సుమారు 1500 కోట్ల బడ్జెట్టుతో రామాయణం సీరీస్ ను చిత్రాలుగా నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ చిత్రనిర్మాణంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రచయితగా తన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ఇప్పటికే ఆయన సంభాషణలు రాయడం పూర్తిచేసినట్టు చెబుతున్నారు. అల్లు అరవింద్ పట్టుబట్టడం వల్ల ఇటీవల లాక్ డౌన్ సమయంలో ఈ చిత్రానికి ఆయన మాటలు రాసి, బైండు అప్పజెప్పినట్టు తెలుస్తోంది.

తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో త్రీడీ ఫార్మాట్ లో నిర్మించే ఈ చిత్రానికి 'దంగల్' ఫేమ్ నితీశ్ తివారీ, 'మామ్' ఫేమ్ రవి ఉద్యావర్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు. వివిధ భాషలకు చెందిన నటీనటులను దీనికి ఎంపిక చేసే పనిలో చిత్ర బృందం వుంది.

More Telugu News