Raja Singh: ట్రక్‌లో 33 ఆవుల తరలింపు.. అడ్డుకుని మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్

raja singh slams trs

  • చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • ఆవులను హింసించటం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమన్న రాజాసింగ్
  • పలు జిల్లాల నుంచి ప్రతిరోజు బర్కత్‌పురకు ట్రక్కులు వస్తున్నాయని ఆగ్రహం
  • ఆవుల తరలింపును కేసీఆర్ ఎందుకు అడ్డుకోవట్లేదని ప్రశ్న 

ట్రక్కులో ఆవులను తరలిస్తోన్న వారిని తన మద్దతుదారులతో కలిసి హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజా సింగ్ పట్టుకున్నారు. ఆవులను తరలిస్తోన్న వారి గురించి సమాచారం అందుకున్న ఆయన చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రక్‌లో 33 ఆవులను తరలిస్తోన్న వారిని అడ్డుకున్నారు.

ఆవుల తరలింపు చర్యలపై రాజాసింగ్ మండిపడ్డారు. ఆవులను హింసించటం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని ఆయన గుర్తు చేశారు. పలు జిల్లాల నుంచి ప్రతిరోజు బర్కత్‌పురకు ట్రక్కులు వస్తున్నాయని ఆయన చెప్పారు. గొప్ప హిందువునని చెప్పుకుంటోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవుల తరలింపును ఎందుకు అడ్డుకోవట్లేదని రాజాసింగ్ నిలదీశారు. ఆవుల తరలింపు విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాగా, గతంలోనూ రాజాసింగ్ అనేక సార్లు ఆవుల తరలింపును అడ్డుకున్నారు.

Raja Singh
BJP
Telangana
cows
  • Loading...

More Telugu News