Bunny Vasu: నిర్మాత బన్నీ వాసును పరామర్శించిన అల్లు అర్జున్

Allu Arjun meets Bunny Vasu

  • ఇటీవల మృతి చెందిన బన్నీ వాసు సోదరుడు
  • పరామర్శించిన బన్నీ, అల్లు శిరీష్, సుకుమార్
  • ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాను నిర్మిస్తున్న బన్నీ వాసు

తెలుగు సినీ నిర్మాత బన్నీ వాసు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు సురేశ్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు బన్నీ వాసును, ఆయన కుటుంబ సభ్యులను అర్జున్ పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు అల్లు శిరీష్, దర్శకుడు సుకుమార్ తో కలిసి అల్లు అర్జున్ వెళ్లారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ప్రస్తుతం బన్నీ వాసు అఖిల్ హీరోగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పని  చేసిన బన్నీ వాసు... ఆ తర్వాత సహ నిర్మాతగా, అనంతరం నిర్మాతగా మారి, పలు చిత్రాలను నిర్మించారు. మరోవైపు, ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' అనే చిత్రంలో నటిస్తున్నారు.

Bunny Vasu
Allu Arjun
Tollywood
  • Loading...

More Telugu News