Vishal: ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న విశాల్

Actoro Vishal to contest in Assembly elections

  • త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు
  • పోటీ చేయడంపై అభిమాన సంఘాల నేతలతో విశాల్ చర్చలు
  • పోటీ చేసే స్థానంపై త్వరలోనే ప్రకటన

తెలుగు వాడైన తమిళ సినీ హీరో విశాల్ కోలీవుడ్ లో ఇప్పటికే తన సత్తా ఏంటో చాటాడు. నిర్మాతల సంఘం, నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి, గెలుపొందాడు. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు.

గతంలోనే జయలలిత మృతి వల్ల ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి విశాల్ రెడీ అయ్యాడు. నామినేషన్ కూడా వేశాడు. అయితే నామినేషన్ ను ప్రతిపాదించిన 10 మందిలో కొంత మంది మద్దతును ఉపసంహరించుకోవడంతో... ఆ నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల్లో పోటీ  చేసేందుకు విశాల్ సిద్ధమవుతున్నాడు.

త్వరలోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో, చెన్నైలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని విశాల్ భావిస్తున్నాడు. దీనికి సంబంధించి తన అభిమాన సంఘాల నేతలతో చర్చలు కూడా జరుపుతున్నాడు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడో త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నాడు.

Vishal
Tollywood
Kollywood
Politics
  • Loading...

More Telugu News