Rana: 'విరాటపర్వం'లో రానా 'కామ్రేడ్ రవన్న'గా ఇలా!

Rana First Glimps in Virataparvam

  • నేడు రానా పుట్టినరోజు
  • విరాటపర్వంలో పాత్ర పరిచయం
  • వీడియో విడుదల చేసిన యూనిట్

నేడు నటుడు రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా 'విరాటపర్వం'లోని ఆయన పాత్ర 'కామ్రేడ్ రవన్న'ను పరిచయం చేస్తూ, ఫస్ట్ గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తుండగా, రానాతో పాటు సాయి పల్లవి, ప్రియమణి, నివేదితా పేతురాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ టీజర్ లో రానా నక్సల్స్ నేతగా కనిపిస్తున్నాడు. చేతిలో గన్ పట్టుకుని, తన సహచరులతో కలిసి నడుస్తుండటం, అడవుల దృశ్యాలు, వాటర్ ఫాల్స్, కొన్ని సీన్స్ జోడించారు. "ఈ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది..." అంటూ ప్రారంభమయ్యే టీజర్ లో "సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది.." అన్న లెటర్స్ కనిపిస్తున్నాయి.

ఇక రవన్న పాత్ర నక్సల్ గా మారకముందు డాక్టర్ రవిశంకర్ అన్న విషయాన్ని కూడా రివీల్ చేశారు. టీజర్ చివర్లో "ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం... దొంగల రాజ్యం, దొపిడి రాజ్యం" అని కూడా వినిపిస్తోంది.

Rana
Birthday
Virataparvam
First Glimps
  • Error fetching data: Network response was not ok

More Telugu News