Virat Kohli: విరాట్ కోహ్లీ వాడిన తొలి ఆడీ కారు... ఏడాదిగా పోలీస్ స్టేషన్ లో!

Kohli First Audi Car is now in Thane Dumpyard

  • కోహ్లీకి ఆడీ కారును బహుమతిగా ఇచ్చిన సంస్థ
  • నేర చరిత్ర ఉన్న వ్యక్తికి దాన్ని అమ్మిన కోహ్లీ
  • పోలీసులు సీజ్ చేయగా థానే డంప్ యార్డులో లగ్జరీ కారు

భారత జట్టు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వాడిన తొలి ఆడీ కారు ఏడాదిగా పోలీస్ స్టేషన్ డంప్ యార్డులో పడి, మట్టికొట్టుకుపోయి వుంది. చాలా సంవత్సరాల నుంచి విరాట్ కోహ్లీ ఆడీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆడీ ఆర్8 వీ10 లగ్జరీ కారును ఆ సంస్థ కోహ్లీకి కానుకగా ఇచ్చింది.

ఆ తరువాత కొంత కాలానికి కోహ్లీ ఆ కారును సాగర్ థక్కర్ అనే వ్యక్తికి అమ్మేశాడు. తాను కోహ్లీ నుంచి కొన్న కారును సాగర్, తన గర్ల్ ఫ్రెండ్ కు బహుమతిగా ఇచ్చాడు. అంతవరకూ ఓకే... కానీ, అతనికి గతంలో నేర చరిత్ర ఉంది. దాదాపు రూ. 12 కోట్ల స్కామ్ లో సాగర్ పోలీసులకు పట్టుబడటంతో, అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు, కోహ్లీ వద్ద కొన్న ఆడీ కారును కూడా సీజ్ చేశారు.

ఈ కారును తీసుకెళ్లి థానే పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఇది ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ దుమ్ము పట్టేసింది. ఈ కారును గుర్తించిన ఓ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్, దీన్ని ఫోటో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ అయింది. దాదాపు ఏడాదిగా అది అక్కడే పడివుందని, ఇప్పుడు దాని ఖరీదును లెక్కించడం కూడా కష్టమేనని అతను పేర్కొన్నాడు. ఇక తమ అభిమాన స్టార్ క్రికెటర్ వాడిన తొలి లగ్జరీ కారు, ఇలాంటి దుస్థితిలో ఉన్నదన్న విషయాన్ని తెలుసుకున్న ఫ్యాన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Virat Kohli
Audi Car
Thane
Police
  • Error fetching data: Network response was not ok

More Telugu News