Sachin Tendulkar: హ్యాపీ బర్త్ డే వెంకీ మామా... శుభాకాంక్షలు తెలిపిన సచిన్ టెండూల్కర్

Sachin Tendulker wishes Venkatesh on his birthday

  • నేడు సీనియర్ హీరో వెంకటేశ్ పుట్టినరోజు
  • వెంకీపై శుభాకాంక్షల జడివాన
  • విషెస్ తెలిపిన చిరు, మహేశ్, పవన్ తదితరులు
  • ట్విట్టర్ లో స్పందించిన సచిన్
  • ఈ ఏడాది విజయవంతం కావాలంటూ ఆకాంక్ష

టాలీవుడ్ లో అత్యధిక శాతం విజయాలు నమోదు చేసుకున్న హీరోల్లో వెంకటేశ్ ఒకరు. ఆయన నటించిన సినిమాల్లో ఫ్లాపులు చాలా తక్కువ. అందుకే విక్టరీని తన ఇంటి పేరు చేసుకుని విక్టరీ వెంకటేశ్ గా పేరుతెచ్చుకున్నారు. ఇవాళ వెంకటేశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనపై శుభాకాంక్షల జడివాన కురుస్తోంది. ప్రముఖులందరూ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు.

చిరంజీవి, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ తదితరులు వెంకీకి సోషల్ మీడియా ద్వారా పలకరించారు. తాజాగా భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా వెంకటేశ్ కు జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే వెంకీ మామా అంటూ ట్వీట్ చేశారు. ఈ ఏడాది విజయవంతంగా గడిచిపోవాలని, సంతోషం, ఆరోగ్యం కలగాలని సచిన్ ఆకాంక్షించారు.

Sachin Tendulkar
Venkatesh
Birthday
Wishes
  • Loading...

More Telugu News