Kiyara Advani: మొదటి డేటింగ్ లోనే ముద్దిస్తానా ఏంటి? ఊరించి వెంటపడేలా చేస్తా: కియారా అడ్వాణీ

Dont Give Kiss on First Date says Kiyara Advani

  • నా ఫస్ట్ క్రష్ విఫలమైంది
  • ప్రస్తుతానికి సింగిల్ గానే ఉన్నా
  • ఫీచర్ మూవీస్ చేయాలని ఉందన్న కియారా

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో 'భరత్ అనే నేను' చిత్రంలో నటించి, తెలుగు సినీ ప్రేక్షకులకు తన అందాలను పరిచయం చేసిన కియారా అడ్వాణీ, ఎదుటి వారిని ఏడిపించడంలో ముందుంటుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చిన్నతనంలోనే తన ఫస్ట్ క్రష్ విఫలమైందని, తొలి బాయ్ ఫ్రెండ్ తో చాలా సన్నిహితంగా ఉన్న రోజుల్లో, తల్లిదండ్రులు తమను కలవనివ్వకుండా దూరం చేశారని చెప్పింది.

తాను ప్రస్తుతానికి సింగిల్ గానే ఉన్నానని, అయితే, ఏదో ఒక సమయంలో ఎవరితోనే ఒకరితో కలవాల్సిందేనని చెప్పింది. మనసుకు నచ్చిన వారితోనే డేటింగ్ చేయాలని నమ్ముతానని, ఒకవేళ తనకు అలా నచ్చి, డేటింగ్ వెళితే, తొలిసారి బయటకు వెళ్లినప్పుడే ముద్దిచ్చే ప్రసక్తే లేదని కుండ బద్ధలు కొట్టింది. అతన్ని ఊరించి, తన వెంటపడేలా చేసుకుంటానని, ఆ తరువాతే ముద్దులని చెప్పేసింది. తనకు సోషలిజంతో కూడిన పాత్రలు చేయాలంటే ఇష్టం ఉండదని, యూఎస్ షోస్ ఎక్కువగా చూసే తనకు అటువంటి కథలతో ఫీచర్ మూవీ చేయాలని ఉందని చెప్పింది.

Kiyara Advani
Dating
Kiss
Bharath Ane Nenu
  • Loading...

More Telugu News