Student: కళాశాల దరఖాస్తులో బాలీవుడ్ తారలను తల్లిదండ్రులుగా పేర్కొన్న విద్యార్థి

Bihar Student mention Bollywood stars as his parents

  • బీహార్ లోని ముజఫర్ పూర్ లో ఘటన
  • బీఏ సెకండియర్ చదువుతున్న కుందన్ కుమార్
  • హాల్ టికెట్ కోసం దరఖాస్తు
  • తల్లి సన్నీ లియోనీ, తండ్రి ఇమ్రాన్ హష్మీ అని పేర్కొన్న వైనం
  • స్పందించిన సన్నీ లియోనీ
  • పిల్లలు కాదు పిడుగులు అంటూ ట్వీట్

బీహార్ లో ఓ విద్యార్థి కళాశాలలో సమర్పించిన దరఖాస్తులో తల్లిదండ్రులుగా బాలీవుడ్ సినీ నటులను పేర్కొన్న ఘటన వెలుగులోకి వచ్చింది. బీహార్ లోని ముజఫర్ పూర్ కు చెందిన కుందన్ కుమార్ (20) స్థానిక ధన్ రాజ్ మహతో కాలేజీలో బీఏ సెకండియర్ చదువుతున్నాడు. అయితే పరీక్షల కోసం దరఖాస్తు చేసే క్రమంలో తల్లిదండ్రుల పేర్లు రాయాల్సిన చోట సినీ తారల పేర్లు పేర్కొన్నాడు. తల్లి పేరు సన్నీ లియోనీ అని, తండ్రి పేరు ఇమ్రాన్ హష్మీ అని రాశాడు.

అయితే ఈ విషయం బాలీవుడ్ నటి సన్నీ లియోనీ దృష్టికి వెళ్లింది. బాబోయ్, ఈ పిల్లలు మామూలోళ్లు కాదు.. అంటూ స్పందించారు. ఇలాగే కలలు కంటూ ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. సన్నీ స్పందించిందన్న కారణంతో సామాజిక మాధ్యమాల్లో కుందన్ కుమార్ దరఖాస్తు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News