Somu Veerraju: ఏపీలో హిందూ మతాన్ని దెబ్బతీసేలా సర్కారు వ్యవహరిస్తోంది: సోము వీర్రాజు

somu veerraju slams ysrcp

  • దేవాలయాల భూముల జోలికి వస్తే ఊరుకోము
  • వైసీపీ సర్కారు అవినీతికి దారులు తెరిచింది
  • ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి వరకు ట్రేడింగ్‌  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో హిందూ మతాన్ని దెబ్బతీసేలా వైసీపీ సర్కారు వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. దేవాలయాల భూముల జోలికి వస్తే తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు.

రాష్ట్రంలో వైసీపీ సర్కారు అవినీతికి దారులు తెరిచిందంటూ సోము వీర్రాజు ఆరోపణలు గుప్పించారు. ఏపీలో ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి వరకు ట్రేడింగ్‌ ప్రారంభించారని, అధికార వైసీపీ ఎమ్మెల్యేలే ఎర్రచందనం అక్రమ రవాణా‌ చేస్తున్నారని ఆయన అన్నారు. లిక్కర్‌ అమ్మకాల్లో ప్రభుత్వంలోని కొందరు డబ్బు దోచుకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారు.  

Somu Veerraju
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News