Vijay Devarakonda: నోటితో తన బొమ్మ గీసిన అభిమాని పట్ల విజయ్ దేవరకొండ స్పందన

Vijay Devarakonda responds to a fan art work

  • చిత్రలేఖనంలో ప్రతిభ చూపుతున్న దివ్యాంగురాలు స్వప్నిక
  • తాజాగా విజయ్ దేవరకొండ బొమ్మ గీసిన వైనం
  • తన బొమ్మను చూసి అచ్చెరువొందిన విజయ్
  • నీకు అపారమైన ప్రేమను పంపుతున్నానంటూ ట్వీట్
  • నీ నుంచి స్ఫూర్తి పొందుతున్నానని వ్యాఖ్య 

స్వప్నిక అనే దివ్యాంగురాలు చేతులు లేకపోయినా నోటితో కుంచె, పెన్సిల్ పట్టుకుని చిత్రాలు గీయడంలో ఎంతో నైపుణ్యం సంపాదించింది. స్వప్నిక టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండకు వీరాభిమాని. తాజాగా ఆమె విజయ్ దేవరకొండ చిత్రాన్ని నోటితోనే గీసింది. దీన్ని ఆమె ట్విట్టర్ లో పంచుకోగా, హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. స్వప్నికకు కృతజ్ఞతలు తెలిపారు. "నీకు అపారమైన ప్రేమను పంపుతున్నాను స్వప్నిక. నీ నుంచి స్ఫూర్తిని, శక్తిని పొందుతున్నాను" అంటూ విజయ్ ట్వీట్ చేశారు. అంతేకాదు, స్వప్నిక వీడియోను కూడా తన ట్వీట్ లో పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News