Sanjay Dutt: ఈ విషయంలో నేను సిగ్గు పడటం లేదు: సంజయ్‌ దత్‌ కూతురు త్రిషాల

Sanjay Dutts daughters comments on his father

  • గతంలో మా నాన్న డ్రగ్స్ కు అలవాటు పడ్డారు
  • దాని గురించి ఆయన ఒప్పుకున్నారు
  • బయటపడేందుకు సహాయం కూడా కోరారు

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవితంలో ఉన్నన్ని కోణాలు మరెవరి జీవితంలో ఉండకపోవచ్చు. స్టార్ డమ్, డ్రగ్స్, అఫైర్స్, డౌన్ ఫాల్, జైలు జీవితం... ఇలా సంజూ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. అయితే ఆయన జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే. ప్రతి అంశం అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడ్డారు. అయినా ఏమాత్రం భయపడకుండా, దానిని ఎదుర్కొని, ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. తన తండ్రి గురించి తాజాగా ఆయన కూతురు త్రిషాలా దత్ స్పందించారు.

తన తండ్రి గతంలో డ్రగ్స్ కు అలవాటు పడినా... దాన్నుంచి బయటపడ్డారని త్రిషాలా అన్నారు. డ్రగ్స్ తీసుకుంటున్నానని తనకు తానుగా ఒప్పుకోవడమే కాకుండా, దాన్నుంచి బయటపడటానికి సహాయం కోరారని, అది చాలా గొప్ప విషయమని చెప్పారు. ఈ విషయంతో తాను సిగ్గుపడటం లేదని అన్నారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని చెప్పారు.

  • Loading...

More Telugu News