Aadhar card: వచ్చే నెల నుంచే హైదరాబాద్‌లో ఉచిత తాగునీరు.. ఆధార్ ఉంటేనే సుమా!

Free water supply from next month in Hyderabad

  • కొత్త కనెక్షన్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ జీవో
  • ఆధార్ లేకుంటే వచ్చే వరకు ఏదో ఒక గుర్తింపు కార్డును ఇవ్వాల్సిందే
  • అన్ని కనెక్షన్లకు నీటి మీటర్లు తప్పనిసరి

హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకానికి రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులో, లేదంటే వచ్చే నెల నుంచి దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఉచిత తాగునీటి పథకానికి ఆధార్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెల 2న పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ పేరుతో జీవో విడుదల కాగా, నిన్న దీనిని అధికారికంగా విడుదల చేశారు.

ఆధార్ కార్డు లేనివారు దరఖాస్తు చేసుకున్న రసీదును చూపిస్తే సరిపోతుంది. ఒకవేళ కార్డు రావడం ఆలస్యమైతే పోస్టాఫీసు పాస్‌బుక్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, రేషన్‌కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. అయితే, కొత్త కనెక్షన్‌దారులకే ఈ నిబంధన వర్తిస్తుందా? లేక, ఇప్పటికే కనెక్షన్ కలిగిన వారు కూడా ఆధార్ సమర్పించాలా? అన్న విషయంలో స్పష్టత లేదు.

నగరంలోని మొత్తం నీటి కనెక్షన్లలో మూడొంతుల కనెక్షన్లకు మీటర్లు లేవు. దొంగ కనెక్షన్లు కూడా భారీగా ఉన్నాయి. కొత్త పథకం అమల్లోకి వస్తే అందరూ తప్పనిసరిగా నీటి మీటర్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఉచిత నీటి పథకం అమలుకు ఏడాదికి రూ.153.65 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం చెబుతోంది.

Aadhar card
water connection
free water
Hyderabad
  • Loading...

More Telugu News