Pawan Kalyan: రీమేక్ సినిమా కోసం పవన్ కల్యాణ్ పాట?

Pawan Kalyan to sing a song for his coming film
  • 'వకీల్ సాబ్' తర్వాత పవన్ రీమేక్ సినిమా 
  • 'అయ్యప్పనుమ్ కోషియమ్'లో పవన్, రానా
  • ఒరిజినల్ సినిమాలో ప్రోమో సాంగ్
  • పవర్ ఫుల్ ట్యూన్ చేస్తున్న తమన్   
కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయిన పవన్ కల్యాణ్ త్వరలో ఓ పాట పాడే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ చేత ఈ పాటను పాడించడానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. పవన్ తో పాటు ఈ పాటలో మరో హీరో రానా దగ్గుబాటి కూడా గొంతు సవరిస్తాడని సమాచారం.

ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్న పవన్.. దీని తర్వాత కొన్ని సినిమాలను ఇప్పటికే లైన్లో పెట్టారు. వాటిలో ముందుగా మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ ను చేయడానికి రెడీ అవుతున్నారు. మలయాళంలో బిజూ మీనన్, పృథ్వీ రాజ్ పోషించిన పాత్రలను తెలుగులో పవన్, రానా చేయనున్నారు. దీనికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.  

ఈ చిత్రం మలయాళ మాతృక విషయంలో బిజూ మీనన్, పృథ్వీ రాజ్ కలసి ఓ ప్రమోషనల్ సాంగ్ పాడారు. తెలుగులో కూడా ఇలాంటి పాటను పెట్టడం కోసం సంగీత దర్శకుడు తమన్ ఓ పవర్ ఫుల్ ట్యూన్ ను రెడీ చేస్తున్నాడట. ఈ ప్రోమో సాంగును పవన్, రానాల చేత పాడించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. మరి, పవన్ దీనికి ఎస్ చెబుతారా? లేదా? అన్నది చూడాలి!
Pawan Kalyan
Rana Daggubati
Vakeel Sab
Ayyappanum Koshiyam

More Telugu News