Mahesh Babu: ముంబయిలో మహేశ్ బాబు ఫ్యామిలీ ట్రిప్... ఫొటోలు ఇవిగో!

Mahesh Babu and family enjoys in Mumbai
  • ఇటీవలే దుబాయ్ వెళ్లొచ్చిన మహేశ్ బాబు
  • ఫ్యామిలీతో తాజాగా ముంబయి ట్రిప్
  • మిత్రులతో ఉల్లాసంగా గడిపిన సూపర్ స్టార్
  • మహేశ్ కు జతకలిసిన వంశీ పైడిపల్లి
  • ఫొటో పంచుకున్న నమ్రత
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ముంబయిలో ఉన్నారు. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లొచ్చిన మహేశ్ బాబు, ఆపై ముంబయి వెళ్లారు. మహేశ్ బాబు, నమ్రత, సితార ముంబయి ఎయిర్ పోర్టులో కెమెరాలకు చిక్కారు. ఇక, ముంబయిలో తన మిత్రులను కలిసిన మహేశ్ బాబు వారితో ఉల్లాసంగా గడిపారు. టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా మహేశ్ తో జతకలిశారు. దీనికి సంబంధించిన ఫొటోను నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పార్టీలో మహేశ్ బాబుకు బాగా నచ్చిన సెలబ్రిటీ, ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అవినాశ్ గోవారికర్, ఆయన అర్ధాంగి షాజియా కూడా ఉన్నారు.
Mahesh Babu
Family
Mumbai
Namrata
Vamsy Paidipalli
Avinash Gowarikar

More Telugu News