Mahesh Babu: మహేశ్ బాబు సినిమాకి 'రౌడీ' టైటిల్?

State Rowdy title considered for Mahesh Babu film
  • 'సర్కారు వారి పాట'లో నటిస్తున్న మహేశ్ 
  • తదుపరి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా
  • మాస్ రౌడీ పాత్రలో కనిపించనున్న మహేశ్
  • 'స్టేట్ రౌడీ' టైటిల్ని పరిశీలిస్తున్న దర్శకుడు       
ముప్పై ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'స్టేట్ రౌడీ'. అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి బాక్సాఫీసు రికార్డు సృష్టించిన చిత్రం అది. ఈ వసూళ్ల గురించి అప్పట్లో బాలీవుడ్ పత్రికలు కూడా గొప్పగా రాశాయి. అటువంటి ఆ సినిమా టైటిల్ ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లో వినిపిస్తోంది. అది కూడా నేటి సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించే చిత్రానికి పరిశీలిస్తున్నారన్నది పెద్ద విశేషం.

'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తాజాగా 'సర్కారు వారి పాట' పేరిట ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి మహేశ్ ఓకే చెప్పాడు. ఇందులో మహేశ్ పక్కా మాస్ రౌడీ క్యారెక్టర్లో కనిపిస్తాడట. దీంతో ఈ చిత్రానికి 'స్టేట్ రౌడీ' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతన్నది త్వరలో తెలుస్తుంది.

ఇదిలావుంచితే, బ్యాంకు స్కామ్ ల నేపథ్యంలో రూపొందే 'సర్కారు వారి పాట' చిత్రం రెగ్యులర్ షూటింగును వచ్చే నెల నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం బ్యాంక్ సెట్ ను కూడా వేస్తున్నారు. ఆ షెడ్యూల్ తర్వాత యూనిట్ మరో షెడ్యూల్ కోసం అమెరికా వెళుతుంది.
Mahesh Babu
Vamshi Paidipally
Chiranjeevi
Parashuram

More Telugu News