key: 47 ఏళ్ల క్రితం తీసుకెళ్లిన తాళం చెవిని ఇప్పుడు జాగ్రత్తగా తిరిగిచ్చిన అజ్ఞాత వ్యక్తి!

man returns key after 50 years

  • ఇంగ్లండ్‌లో వింత ఘటన 
  • 1973 ఓ టవర్‌కు చెందిన తాళం చెవిని తీసుకెళ్లిన వ్యక్తి 
  • తాజాగా దాన్ని పంపుతూ క్షమాపణ లేఖ
  • ట్విట్టర్‌లో చెప్పిన ఇంగ్లిష్‌ హెరిటేజ్‌  

ఇంగ్లండ్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. 1973లో ఓ టవర్‌కు చెందిన తాళం చెవిని తీసుకెళ్లిన ఓ వ్యక్తి తాజాగా దాన్ని పంపుతూ క్షమాపణ లేఖ రాశాడు. కెంట్‌లో 11వ శతాబ్దానికి చెందిన సెయింట్‌ లియోనార్డ్‌ టవర్‌ ఉంది. దాని తాళం చెవి 47 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి తీసుకెళ్లిపోయాడు. అప్పటి నుంచి దాన్ని తిరిగి ఇవ్వలేదు.

తాజాగా, ఆ టవర్ నిర్వాహకులకు ఓ పార్సిల్‌ రావడంతో దాన్ని విప్పి చూశారు. అందులో తాళం చెవి ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అందులోని లేఖలో సదరు వ్యక్తి క్షమాపణలు కూడా చెప్పాడు. సెయింట్‌ లియోనార్డ్‌ టవర్‌కు చెందిన తాళం చెవిని తిరిగి తీసుకోండని కోరాడు. తాను దాన్ని 1973లో తీసుకున్నానని, ఈ ఏడాది తిరిగిస్తున్నానని, ఆలస్యం అయినందుకు క్షమించాలని కోరాడు.

దీనిపై చారిటీ సంస్థ ఇంగ్లిష్‌ హెరిటేజ్‌ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆ లేఖ, తాళం చెవిని పోస్టు చేసింది. 47 ఏళ్ల క్రితం తీసుకున్న తాళం చెవిని ఇప్పుడు తిరిగి ఇచ్చాడని, ఇది దారుణమేనని పేర్కొంది. అయినప్పటికీ దాన్ని ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపింది. దాన్ని అప్పగించడంలో ఆలస్యమైందని బాధపడవద్దని, ఎందుకంటే వాటి తాళాలను ఎప్పుడో మార్చేశామని తెలిపింది. ఆ అజ్ఞాత వ్యక్తి తన వివరాలను పంపాలని ఆ సంస్థ కోరింది. మరి, ఇప్పుడైనా సదరు తాళంచెవి తీసుకున్న వ్యక్తి తన పేరు వెల్లడిస్తాడేమో చూడాలి! 

  • Loading...

More Telugu News