Kiara Advani: హృతిక్ సినిమాలో కృతి స్థానంలో కియారా!

Kiara replaced Kruti in Krish sequel

  • హృతిక్ రోషన్ కథానాయకుడుగా 'క్రిష్ 4'
  • సూపర్ నేచురల్ పవర్స్ కథాంశం  
  • డేట్స్ ఇవ్వలేకపోతున్న కృతి సనన్
  • ప్రస్తుతం కియారా అద్వానీతో సంప్రదింపులు

బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సరసన అవకాశం రావడం అంటే మాటలు కాదు.. అందులోనూ హ్యాండ్ సమ్ హీరో హృతిక్ రోషన్ పక్కన ఛాన్స్ అంటే మరీనూ. ఇప్పుడు అలాంటి చక్కని అవకాశం కియారా అద్వానీకి లభించినట్టు వార్తలొస్తున్నాయి. పైగా, ప్రతిష్ఠాత్మక 'క్రిష్' సిరీస్ అయిన 'క్రిష్ 4'లో నటించే సదవకాశం ఈ ముద్దుగుమ్మకు వచ్చినట్టు తెలుస్తోంది.

హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ దర్శకత్వంలో 'క్రిష్ 4' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సూపర్ నేచురల్ పవర్స్ నేపథ్యంగా సాగే కథతో ఈ చిత్రాన్ని మరింత మోడ్రన్ గా నిర్మించడానికి ప్లానింగ్ జరుగుతోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు వుంటారు. వీరిలో ప్రధాన కథానాయిక పాత్రకు కృతి సనన్ ని తీసుకున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఆమె స్థానంలో ఇప్పుడు కియారా పేరు తెరపైకి వచ్చింది.

"కృతి సనన్ ని అనుకున్న మాట నిజమే. ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయి. ఆమె కూడా మొగ్గు చూపింది. అయితే, ఇతర కమిట్ మెంట్స్ తో ఆమె డైరీ నిండివుండడంతో ఆమె డేట్లు సర్దుబాటు చేయలేకపోతోంది. దీంతో కియారాను ప్రస్తుతం సంప్రదించడం జరుగుతోంది' అంటూ హృతిక్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నట్టు బాలీవుడ్ మీడియా పేర్కొంది. మొత్తానికి ఈ ఆఫర్ ఖరారైతే కనుక కియరాకు ఇది బాలీవుడ్ లో మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పచ్చు!

Kiara Advani
Hrutik Roshan
Kruti Sanon
  • Loading...

More Telugu News