Amit Shah: జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి.. దర్యాప్తుకు ఆదేశించి అమిత్ షా

Amit Shah orders probe into attack on BJP Chief convoy

  • పశ్చిమబెంగాల్ లో నడ్డా కాన్వాయ్ పై దాడి
  • ఆగ్రహం వ్యక్తం చేసిన అమిత్ షా
  • శాంతిభద్రతలపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ ను కోరిన అమిత్ షా

పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దర్యాప్తుకు ఆదేశించారు. అంతేకాదు రాష్ట్రంలోని శాంతిభద్రతలపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని గవర్నర్ ను కోరారు.

కోల్ కతాకు 60 కిలోమీటర్ల దూరంలో నడ్డా కాన్వాయ్ పై దాడి జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. పార్టీ కార్యకర్తల సమావేశం కోసం డైమండ్ హార్బర్ కు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ నియోజకవర్గం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి చెందినది.

వీడియో ఫుటేజీలో రాళ్లతో కారు అద్దాలను పగలగొడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనుపడుతున్నాయి. రాళ్లు, కర్రలు, రాడ్లను టీఎంసీ శ్రేణులు దాడికి ఉపయోగించాయని బీజేపీ నేతలు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News