TSRTC: డోర్ డెలివరీ సేవలు ప్రారంభించిన తెలంగాణ ఆర్టీసీ కార్గో
- కొన్నాళ్లుగా కార్గో సేవలు అందిస్తున్న ఆర్టీసీ
- ఇకపై నేరుగా ఇంటికే పార్శిళ్లు
- ఖైరతాబాద్ లో ప్రారంభించిన మంత్రి పువ్వాడ
- నగరంలో మూడు ఏజెన్సీలు సేవలందిస్తాయని వెల్లడి
- ప్రజల్లో ఆర్టీసీ కార్గో సేవలకు ఆదరణ లభిస్తోందని వివరణ
గత కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు సరకు రవాణా సేవలు కూడా అందిస్తున్నాయి. అయితే తెలంగాణ ఆర్టీసీ కార్గో విభాగం ఒకడుగు ముందుకు వేసి డోర్ డెలివరీ సేవలు ప్రారంభించింది. ఇకపై ఆర్టీసీ ద్వారా వచ్చే పార్శిళ్లను నేరుగా ఇంటికే తెచ్చివ్వనున్నారు.
ఈ మేరకు రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖైరతాబాద్ లో ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సేవలను ప్రారంభించారు. కార్గో సేవల ద్వారా ఆర్టీసీకి రోజుకు రూ.15 లక్షల వరకు ఆదాయం వస్తోందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. హైదరాబాదు నగరంలో ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్ పల్లి ప్రాంతాల పరిధిలో మూడు ఏజెన్సీలు ఈ డోర్ డెలివరీ సేవలు నిర్వహిస్తాయని వివరించారు. కార్గో సేవలకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని అన్నారు.