vaddera corporation: కాజా టోల్‌గేట్ వద్ద ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ రేవతి హల్‌చల్

Devalla Revathi halchal at toll gate

  • టోల్ చెల్లించమన్నందుకు రెచ్చిపోయిన రేవతి
  • నన్నే ఆపుతావా? అంటూ సిబ్బందిపై వీరంగం
  • అడ్డుకోబోయిన సిబ్బందిపై చేయి చేసుకున్న వైనం

‘‘నన్నే టోల్ చెల్లించమని అడుగుతావా? నేనెవరో తెలుసా?’’ అంటూ ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ దేవళ్ల రేవతి రెచ్చిపోయారు. టోల్ సిబ్బందిని తిడుతూ అడ్డుకోబోయిన సిబ్బందిపై చేయి చేసుకున్నారు. గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్ వద్ద జరిగిందీ ఘటన. టోల్ చెల్లించి ముందుకెళ్లాలని సిబ్బంది అడగడంతో ఆగ్రహంతో కారు దిగిన ఆమె చెలరేగిపోయారు. నన్నే ఆపుతావా? అంటూ పరుష పదజాలంతో సిబ్బందిపై విరుచుకుపడ్డారు. తన కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను స్వయంగా తొలగించిన ఆమె, అడ్డుకోబోయిన సిబ్బందిపై చేయిచేసుకున్నారు. అనంతరం విజయవాడ వైపు వెళ్లిపోయారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News