Anil Kapoor: భారత వాయుసేనకు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ క్షమాపణలు

  • ‘ఏకే వర్సెస్ ఏకే’ సినిమాలో ఐఏఎఫ్ అధికారిగా అనిల్ కపూర్
  • యూనిఫాంలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఐఏఎఫ్
  • ఐఏఎఫ్ అంటే తనకెంతో గౌరవమన్న అనిల్ కపూర్
Anil Kapoor apologises after IAF objects to scenes in AK vs AK

‘ఏకే వర్సెస్ ఏకే’ సినిమాలో భారత వాయుసేన యూనిఫాం ధరించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ భారత వాయుసేన (ఐఏఎఫ్)కు క్షమాపణలు చెప్పారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఈ నెలలో విడుదల కావాల్సి ఉంది.

ఇటీవల విడుదలైన ‘ఏకే వర్సెస్ ఏకే’ ట్రైలర్‌లో యూనిఫాం ధరించిన అనిల్ కపూర్ అనుచిత సంభాషణలు పలికారంటూ ఐఏఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐఏఎఫ్‌లో పనిచేసే వారి ప్రవర్తన, పరిభాషకు తగ్గట్టుగా ఆ పాత్ర సంభాషణలు లేవని పేర్కొన్న ఐఏఎఫ్, వెంటనే ఆ సీన్లను తొలగించాలని డిమాండ్ చేసింది.

ఐఏఎఫ్ అభ్యంతరంపై వెంటనే స్పందించిన అనిల్ కపూర్ ఇది కావాలని చేసిన పనికాదని, జరిగిన దానికి తనను క్షమించాలని వేడుకుంటూ ట్వీట్ చేశారు. ఓ నటుడిగానే తాను యూనిఫాం ధరించానని చెబుతూ తాను ఆ వ్యాఖ్యలు చేయడం వెనకున్న కథను తెలిపారు.

కిడ్నాప్‌కు గురైన తన కుమార్తె కనబడడం లేదన్న ఆక్రోశం సంభాషణల్లో కనిపిస్తుందన్నారు. పాత్ర కోసమే ఆ డైలాగులు తప్ప తనకు కానీ, దర్శకుడికి కానీ, ఐఏఎఫ్ పట్ల ఎలాంటి చెడు అభిప్రాయం లేదన్నారు. ఎవరి మనోభావాలు గాయపరచాలనే ఉద్దేశం తనకు లేదని, జరిగిన దానికి తనను క్షమించాలని అనిల్ కపూర్ వేడుకున్నారు.

More Telugu News