Kajal Agarwal: దయ్యాలతో ఇబ్బంది పడే పాత్రలో కాజల్!

Kajal Agarwal in a ghosty movie

  • హనీమూన్ ముగించుకుని వచ్చిన కాజల్ 
  • తెలుగులో 'ఆచార్య', 'మోసగాళ్లు' సినిమాలు
  • తమిళంలో తాజాగా హారర్ సినిమా 'ఘోస్టీ'  
  • పోలీస్ అధికారి పాత్రలో ముద్దుగుమ్మ  

కాజల్ అగర్వాల్ స్వల్ప విరామం తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి పెడుతోంది. ఇటీవల వివాహం చేసుకుని భర్తతో కలసి హనీమూన్ ఎంజాయ్ చేసివచ్చింది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో చిరంజీవి సరసన 'ఆచార్య', మంచు విష్ణు హీరోగా నటిస్తున్న 'మోసగాళ్లు' సినిమాలలో నటిస్తోంది. త్వరలోనే 'ఆచార్య' సినిమా షూటింగులో జాయిన్ కానుంది.

మరోపక్క, తాజాగా తమిళంలో ఓ చిత్రాన్ని అంగీకరించింది. ఈ చిత్రానికి దర్శకుడు డీకే దర్శకత్వం వహిస్తాడు. ఇది హారర్ కథాంశంతో సాగుతుంది. అందుకే దీనికి 'ఘోస్టీ' అనే టైటిల్ని నిర్ణయించారు. ఇందులో ఆమె పోలీస్ అధికారి పాత్రలో నటిస్తుంది. అనుకోకుండా ఎదురయ్యే దయ్యాలతో ఆమె ఎలా ఇబ్బంది పడింది? ఎలా వాటి బారి నుంచి బయటపడింది? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం రూపొందుతుంది.

ఇంతవరకు తాను హారర్ సినిమాలో నటించలేదనీ, ఈ జోనర్లో చేయడం థ్రిల్ గా ఉందని ఈ సందర్భంగా కాజల్ చెప్పింది. ఇక ఇందులో మొత్తం నలుగురు హీరోయిన్లు నటిస్తారు. కాజల్ కాకుండా మరో ముగ్గురు వుంటారు. ప్రస్తుతం వారి ఎంపిక జరుగుతోందని దర్శకుడు డీకే తెలిపారు. ఈ సినిమాలో హీరో అంటూ ఎవరూ ఉండరని ఆయన చెప్పారు.    

Kajal Agarwal
Horror Film
Chiranjeevi
Manchu Vishnu
  • Loading...

More Telugu News