Sanchaita: కొత్త వ్యవసాయ చట్టాలు ల్యాండ్ మార్క్ వంటివి: సంచయిత

Sanchita support farm laws

  • కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు మంచివి
  • మార్పు ఏదైనా కొంత వ్యతిరేకత సహజం
  • అందరం మోదీకి మద్దతు పలుకుదాం

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు ఇబ్బంది పడకూడదనే కారణంతో మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ చేపట్టారు. ఈ వ్యవసాయ చట్టాలు చాలా ఉపయోగకరమైనవని మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయిత అన్నారు. దీనికి సంబంధించి ఆమె ట్వీట్ చేశారు.  

మార్పు ఏదైనా సరే కొంత వ్యతిరేకతను ఎదుర్కోవడం సహజమని సంచయిత అన్నారు. మార్పును మనం స్వాగతించాలని చెప్పారు. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు కొత్త వ్యవసాయ చట్టాలు ఒక ల్యాండ్ మార్క్ వంటివని అన్నారు. అందరం కలసి ప్రధాని మోదీకి మద్దతు పలుకుదామని చెప్పారు.

Sanchaita
Farm Laws
YSRCP
  • Error fetching data: Network response was not ok

More Telugu News