Somireddy Chandra Mohan Reddy: దేశ చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం ఇది: టీడీపీ నేతల మద్దతు

tdp supports bharat bandh

  • విజయవాడలో రైతులకు ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమ మద్దతు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విమర్శలు
  • రైతు సంఘాలతో చర్చించి కొత్త చట్టాలను తేవాలన్న సోమిరెడ్డి

భారత్ బంద్ నేపథ్యంలో రైతులకు ఏపీ టీడీపీ నేతలు మద్దతు తెలిపారు. విజయవాడలో రైతులకు ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మద్దతు తెలిపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విమర్శలు గుప్పించారు. పంటల కనీస మద్దతు ధరపై చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు తమ పార్టీ సూచించిన సవరణలు చేయాలని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతుల శ్రమను కార్పొరేట్ సంస్థలు దోచుకుంటాయని చెప్పారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపించారు.

ఇది దేశ చరిత్రలో నిలిచిపోయే ఉద్యమమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ‘రైతులకు మద్దతుగా చేపట్టిన భారత్ బంద్ కి దేశమంతా స్తంభించింది. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ  గారు వెంటనే ఒక ప్రకటన చేయడంతో పాటు రైతు సంఘాలతో చర్చించి కొత్త చట్టాలను తేవాలి’ అని ఆయన ఓ వీడియో రూపంలో తన అభిప్రాయాలను తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News