‘నిహారికని చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో..’ అంటూ ఫొటోలు పోస్ట్ చేసిన చిరు
- రేపు నిహారిక పెళ్లి
- చిన్నప్పుడు ఆమెను ఎత్తుకున్న ఫొటో పోస్ట్
- నిహారికకు చిరు శుభాకాంక్షలు
తనతో చిన్నప్పుడు నిహారిక దిగిన ఫొటోలను కూడా ఆయన పోస్ట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఎత్తుకుని ఆయన అప్పట్లో ఈ ఫొటో దిగారు. ‘మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు, ఆశీస్సులు’ అని చిరు పేర్కొన్నారు.