Amazon: 'వాచ్ పార్టీ' అనే కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టిన అమెజాన్ ప్రైమ్

Amazon India bring Watch Party to Prime Video
  • ఒకేసారి 100 మంది వరకు వీడియో చూసే అవకాశం
  • చాటింగ్ కూడా చేసుకునే సదుపాయం
  • అమెజాన్ ప్రైమ్ వార్షిక సబ్ స్క్రిప్షన్ రూ. 999
ప్రైమ్ వీడియో సర్వీస్ లో అమెజాన్ సంస్థ 'వాచ్ పార్టీ' అనే సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ గ్యాంగ్ మొత్తంతో కలసి ఫేవరెట్ షోలు, సినిమాలు చూడొచ్చు. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అందరూ కలసి చూసే అవకాశం ఈ సదుపాయం ద్వారా లభిస్తుంది. ఒకే సెషన్ లో 100 మంది వరకు వీడియోను చూడొచ్చు. కంట్రోల్ మాత్రం హోస్ట్ చేతిలో ఉంటుంది. కేవలం వీడియోను చూడటమే కాకుండా ఒకరితో మరొకరు కమ్యూనికేట్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. అయితే పార్టిసిపెంట్లు అందరికీ ప్రైమ్ మెంబర్ షిప్ లేదా ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ ఉండాలి. ప్రైమ్ వీడియో మొబైల్ యాప్ ద్వారా కూడా వీడియోలను వీక్షించవచ్చు.

ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవడానికి క్రింది స్టెప్స్ ను అనుసరించాలి.
  • మూవీస్ స్క్రీన్ పై ఉన్న వాచ్ పార్టీ ఐకాన్ ను ప్రెస్ చేయాలి. టీవీ షోల కోసమైతే ఎపిసోడ్ లిస్ట్ లోకి వెళ్లాలి.
  • వాచ్ పార్టీని క్రియేట్ చేసుకోవాలి. చాటింగ్ చేయాలనుకుంటే వారి పేరును ఎంటర్ చేయాలి.
  • వాచ్ పార్టీ లింక్ ను కనీసం 100 మందికి పంపవచ్చు. ఆ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా మీ స్నేహితులు జాయిన్ కావచ్చు.
  • వీడియోను చూడాలనుకున్న వారంతా రెడీ అయిన తర్వాత వాచ్ పార్టీని ప్రారంభించవచ్చు. హోస్ట్ చేస్తున్న వ్యక్తి ప్లే, పాజ్ చేయడం వంటివి చేయవచ్చు.

వాచ్ పార్టీని అమెజాన్ తొలుత అమెరికాలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇండియాలోకి కూడా తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ వార్షిక సబ్ స్క్రిప్షన్ రూ. 999, నెలకు రూ. 129గా ఉంది.
Amazon
Prime Video
New feature
Watch Party

More Telugu News